NEWS

Viral Post: సిక్ లీవ్ కావాలంటే 7 రోజుల ముందే చెప్పాలా.. ఇది ఉద్యోగులకు బంపరాఫరా, లేదంటే మేనేజర్ శాడిజమా?

సిక్ లీవ్ కావాలంటే 7 రోజుల ముందే చెప్పాలా..ఇది ఉద్యోగులకు బంపరాఫరా,లేదంటే మేనేజర్ శాడిజమా? వివిధ రంగాల ఉద్యోగులకు బాధ్యతలు, జీతం వేరుగా ఉండవచ్చు. కానీ ఏ రంగంలో ఉద్యోగికైనా కామన్‌ ప్రాబ్లమ్‌ ఒకటి ఉంటుంది. అదేంటంటే అవసరానికి సెలవు దొరక్కపోవడం. ఉద్యోగులు సెలవు కోసం మేనేజర్లకు రకరకాల కారణాలు చెప్తారని అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన రీల్స్‌, పోస్ట్‌లు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. కానీ తాజాగా ఓ మేనేజర్‌ లీవ్‌ పాలసీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఉద్యోగులు సిక్ లీవ్ కోసం కనీసం ఏడు రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని మేనేజర్ రూల్ పెట్టాడు. దీంతో అనుకోకుండా ఆరోగ్యం పాడవడమే కదా అనారోగ్యం అంటే.. దానికి ఏడు రోజుల ముందుగానే ఎలా సెలవు అప్లై చేసుకోవాలి? అంటూ నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. మేనేజర్‌, ఉద్యోగి వాట్సాప్‌ కన్వర్జేషన్‌ ఒక ఉద్యోగి తన మేనేజర్‌తో జరిగిన వాట్సాప్‌ కన్వర్జేషన్‌ స్క్రీన్‌షాట్‌ను సబ్‌రెడ్డిట్‌ ‘యాంటీవర్క్’ పేజ్‌లో షేర్‌ చేశాడు. వెంటనే పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఉద్యోగి తన మేనేజర్‌కి, ‘నా ఆరోగ్యం బాగాలేదు, కాబట్టి నేను ఆఫీసుకు రాలేను’ అని మెసేజ్‌ పంపాడు. దీనికి మేనేజర్ స్పందిస్తూ, ఉద్యోగిని సిక్‌ లీవ్‌ తీసుకోవాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. ఉద్యోగి అవునని చెప్పాక. మేనేజర్‌ వింత పాలసీ గురించి చెప్పాడు. ‘సిక్ లీవ్ లేదా క్యాజువల్ లీవ్ తీసుకోవాలంటే కనీసం 7 రోజుల ముందు తెలియజేయాలి’ అని పట్టుబట్టాడు. ఈ కన్వర్జేషన్‌ను, తన కన్ఫూజన్‌ను ఉద్యోగి రెడ్డిట్ పోస్ట్‌లో షేర్‌ చేసుకున్నాడు. ‘రాబోయే 7 రోజుల్లో నేను అనారోగ్యంతో ఉంటానో లేదో తెలుసుకోవడం ఎలా?’ అని ప్రశ్నించాడు. వైరల్‌ పోస్ట్‌కి చాలా మంది రెడ్డిట్‌ యూజర్లు స్పందించారు. కొందరు ఫన్నీగా సూచనలు చెప్పారు. మరి కొందరు అన్‌రీజనబుల్‌గా ఉండే ఆఫీస్‌ పాలసీను విమర్శించారు. ఒక రెడ్డిట్‌ యూజర్‌, ‘ప్రతిరోజూ ఒక ఇమెయిల్ పంపండి: ఇప్పటి నుంచి ఏడు రోజుల్లో నేను అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. నాకు సిక్‌ లీవ్‌ అవసరం కావచ్చని చెప్పండి.’ అని ఫన్నీగా కామెంట్‌ చేశాడు. మరొక వినియోగదారు ప్రతి సోమవారం ముందస్తు సిక్‌ లీవ్‌ నోటీసును సబ్మిట్‌ చేయాలని, ఆ వారం అనారోగ్యం బారిన పడకపోతే, సెలవు అవసరం లేకపోతే, వారం చివరిలో క్యాన్సిల్‌ చేయాలని సలహా ఇచ్చాడు. చాలా మంది తమకు వర్క్‌ ప్లేస్‌లో ఎదురైన ఇలాంటి అనుభవాలు షేర్‌ చేసుకున్నారు. ఒక రెడ్డిట్‌ యూజర్‌ సూపర్ మార్కెట్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చెప్పాడు. అతడు కిందపడటంతో కాలికి గాయమైంది. దీంతో వర్క్‌కి రాలేనని చెప్పినందుకు తనపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ‘నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉందని కాల్ చేశాను. అయితే ఎలాగైనా ఆఫీస్‌కు రావాలని లేదా క్రమశిక్షణ చర్యలు తప్పవని నాకు చెప్పారు. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నానని వారికి ఉదయం 8 గంటలలోపు కాల్‌ చేసి చెప్పాలి. ఈ సారి నుంచి నేను మెట్ల మీద నుంచి పడటాన్ని షెడ్యూల్‌ చేసుకుంటాను.’ అని కామెంట్‌ చేశాడు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.