NEWS

Reliance Jio: రిలయన్స్ జియో నుంచి రెండు కొత్త ఫోన్లు.. ధర కేవలం రూ.1099 మాత్రమే..!

రిలయన్స్ జియో డిజిటల్ ఇండియా మిషన్ సక్సెస్ అవ్వడానికి కారణం, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సర్వీస్‌లు అందుబాటులోకి రావడం. టెలికాం బిజినెస్‌లోకి రిలయన్స్ జియో ఎంటర్ అయిన తర్వాతే ఈ లక్ష్యం సాకారం అయింది. ఈ సంస్థ ఫీచర్ ఫోన్లలో కూడా 4G నెట్‌వర్క్‌ ఫెసిలిటీ ఆఫర్ చేస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా హ్యాండ్‌సెట్లు తయారు చేస్తోంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మరో రెండు 4G ఫీచర్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. నిన్న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో రిలయన్స్ జియో రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను పరిచయం చేసింది. వీటి పేర్లు ‘జియో భారత్ V3’ (JioBharat V3), ‘జియో భారత్ V4’ (JioBharat V4). ఇవి రెండూ 4G నెట్‌వర్క్‌తో పని చేస్తాయి. గత ఏడాది జియో రిలీజ్ చేసిన V2 మోడల్‌కు సక్సెసర్‌గా ఈ రెండు మోడళ్లను డిజైన్ చేసింది. ధర ఎంత? జియో భారత్ కొత్త ఎడిషన్ల ధర రూ.1099 మాత్రమే. ఈ రెండు మోడల్స్ త్వరలో మొబైల్ షాపులతో పాటు జియోమార్ట్, అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. రూ.123 మంత్లీ రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14 GB డేటా లభిస్తుంది. జియోభారత్ ప్లాన్ల ధరలు ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే 40 శాతం తక్కువని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్లలో 128 GB స్టోరేజ్ కెపాసిటీ, 1000 mAh బ్యాటరీ ఉంటాయి. ఇవి 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తాయి. జియోభారత్ V3, V4 రెండు మోడల్స్ JioTV, JioCinema, JioPaym, JioChat సర్వీసెస్‌తో వస్తాయి. కస్టమర్లు JioTV ద్వారా ఇష్టమైన టీవీ షోలు, న్యూస్, స్పోర్ట్స్ ఈవెంట్స్ చూడవచ్చు. మొత్తం 455కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌కు యాక్సెస్‌ ఉంటుంది. JioCinema యాప్‌తో టీవీలు, వీడియోలు, స్పోర్ట్స్ కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ స్ట్రీమింగ్ ఫ్రీగా లభిస్తుంది. JioPay అనేది UPI ఇంటిగ్రేషన్ పేమెంట్ సర్వీస్. JioChat ద్వారా కస్టమర్లు ఎవరితో అయినా కనెక్ట్ కావచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ మెసేజింగ్, ఫోటో షేర్, గ్రూప్ చాట్ ఆప్షన్స్ వంటి ఫీచర్లు వీటి సొంతం. జియో నుంచి వచ్చిన అఫర్డబుల్ కీప్యాడ్ స్మార్ట్‌ఫోన్ ‘జియోభారత్’, రూ. 1,000 కంటే తక్కువ విభాగంలో 50 శాతం మార్కెట్ వాటా సాధించిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 యాన్యువల్ రిపోర్ట్‌ పేర్కొంది. ప్రతి భారతీయుడికి డిజిటల్ సర్వీస్‌లను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ ఫీచర్ ఫోన్లను కంపెనీ డిజైన్ చేసింది. నిన్న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ కృషిని ప్రశంసించారు. దేశంలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ఆయన హైలైట్ చేశారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గైడెన్స్‌, ఇండియా మొబైల్ కాంగ్రెస్ స్థాయిని పెంచింది, ప్రపంచ స్థాయిని సాధించింది, ఇది డిజిటల్ ఇన్నొవేషన్, కొలాబరేషన్‌కు ముఖ్యమైన వేదికగా మారింది. ప్రస్తుతం భారతదేశ తలసరి డేటా వినియోగం 30 GB కంటే ఎక్కువగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. కానీ ఇది ఇప్పటి వరకు సాధించిన దాంట్లో సగం మాత్రమే. ఇండియా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సక్సెస్‌ను మిగతా సగం సూచిస్తుంది’ అని వివరించారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.