NEWS

AP Population: ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత.. స్త్రీ, పురుషులు ఎంత మంది ఉన్నారంటే..

ap population ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత..! ఆంధ్రప్రదేశ్లో జనాభా నిష్పత్తి ఎలా ఉంది.. ఫెర్టిలిటీ రేట్ ఎలా ఉంది.! ఏపి మహిళలు ఎంతమంది పిల్లలను కనే అవకాశం ఉంది.మ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత లెక్కలు ఏం చెబుతూ ఉన్నాయి.. ప్రపంచంలోనూ.. ఇటు దేశంలోనూ, రాష్ట్రం లోనూ జనాభా లెక్కలు అనేవి చాలా ముఖ్యమైనవి. 2011 నుంచి ఇప్పటిదాకా సెన్సెస్ రాలేదు కాబట్టి సాధారణ గణాంకాల లెక్కలు మాత్రమే వేస్తోంది జనాభా లెక్కల శాఖ. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా పరిశోధన కేంద్రంలో జనాభా లెక్కలు నిత్యం చేస్తున్నారు. రీసెర్చ్ సెంటర్ బయట బోర్డు చూపిస్తున్నట్టుగా ప్రతి సెకండ్ కి అలాగే నిమిషాలకి జనాభా పెరుగుతున్న లెక్కలు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే జనాభా ఏ విధంగా పెరుగుతోంది.!? నిలకడగా పెరుగుదల రేటు ఉందా.. లేక ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుందా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 812 కోట్లు ఉంది. అలాగే భారతదేశ జనాభా 144 కోట్లు పైనే ఉంది. ప్రపంచంలో భారతదేశంలో జనాభాయే ఎక్కువ. అలాగే జనాభా లెక్కల ప్రకారం మొదటి స్థానంలో ఉన్నది భారత దేశమేనని అందరికి తెలిసిందే. అయితే భారత దేశంలో జనాభా నిలకడగా పెరుగుతోందని, నిష్పత్తి రేటు 1.27 శాతం ఉందని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా పరిశోధనా కేంద్రం డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ బి మునిస్వామి తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ జనాభా విషయానికి వస్తే.. ఏపీ జనాభా ప్రస్తుతం 5.7 కోట్లు ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జనాభా 5.7 కోట్లు కాగా.. నిష్పత్తి రేటు, ఫెర్టిలిటీ రేటు 1.7 ఉంది. అంటే ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని కనే పరిస్థితిలో ఉన్నారని అంచనా వేశారు. ఇక దేశంలో కూడా ఫెర్టిలిటీ రేటు 2.0 గా ఉంది. దీని ప్రకారం దేశంలో కూడా ప్రతి మహిళ ఇద్దరు పిల్లల్ని కనే అవకాశం ఉందని డాక్టర్ మునిస్వామి తెలిపారు. ఇక జనాభా పెరుగుదల రేటు చూస్తే 0.91% గా ప్రపంచం రేటు ఉంది. అలాగే భారతదేశం చూస్తే 0.92గా పర్సెంట్ గా ఉందని గణాంకాల ప్రకారం ఉంది. అలాగే ప్రపంచం మొత్తం మీద పురుషుల జనాభా 408 కోట్లు ఉంటే.. మహిళల జనాభా 403 కోట్లు ఉంది. అలాగే భారతదేశంలో పురుషుల జనాభా 74.33 కోట్లు ఉంటే.. మహిళల జనాభా 69.83 కోట్లు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 2.66 కోట్లు పురుష జనాభా ఉండగా.. స్త్రీల జనాభా 2.657 కోట్లు ఉన్నదని గణాంకాల ప్రకారం చెబుతున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.