NEWS

Parliament Monsoon Session:నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఈ 6 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం

Monsoon Session of Parliament: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)రేపు మంగళవారం వర్షాకాల సమావేశాల్లో కేంద్ర బడ్జెట్‌(Union Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సెషన్‌లో నీట్ పేపర్ లీక్, రైలు భద్రత వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి ఈరోజు పార్లమెంట్ టేబుల్‌పై ఆర్థిక సర్వేను కూడా సమర్పించనున్నారు. 19రోజుల పాటు సమావేశాలు.. వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. 19రోజుల పాటు ఈ సమావేశాలు ఉంటాయి. ఈ సెషన్‌లో ఆరు బిల్లులు ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు భావిస్తోంది.వీటిలో 90 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాన్ని మార్చే బిల్లు కూడా ఉంది. ఈ సెషన్‌లో జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం పొందనుంది. ప్రస్తుతం ఈ కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఉనికిలో లేదు.ఇది కేంద్ర పాలనలో ఉంది. కీలక బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్.. ఈ సెషన్‌లో ఆర్థిక బిల్లుతో పాటు అనేక బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిని పరిశీలించడం,ఆమోదించడం కోసం ప్రభుత్వం విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లును కూడా జాబితా చేసింది. విపత్తు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల పాత్రలో మరింత స్పష్టత,సమన్వయం తీసుకురావడమే ప్రతిపాదిత బిల్లు లక్ష్యం. ఇవే బిల్లులు.. సెషన్‌లో ప్రవేశపెట్టిన మరియు ఆమోదించబడిన ఇతర బిల్లులలో స్వాతంత్రానికి ముందున్న చట్టాన్ని భర్తీ చేయడానికి బాయిలర్ బిల్లు, కాఫీ (ప్రమోషన్,అభివృద్ధి) బిల్లుతో పాటు రబ్బరు (ప్రమోషన్, అభివృద్ధి) బిల్లు ఉన్నాయి. వాడి వేడీ చర్చకు ఛాన్స్.. వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం పార్లమెంటులో రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిజూ జనతాదళ్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంటులో దూకుడుగా లేవనెత్తుతుందని ప్రకటించింది. జెడి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నవీన్ పట్నాయక్ ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ను లేవనెత్తాలని తమ పార్టీ ఎంపీలను కోరారు.మరి ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు కూడా ఈసమావేశాల్ని గట్టిగా ఉపయోగించుకోవాలని ప్రత్యేక ఎజెండాతో ఉన్నట్లుగా తెలుస్తోంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.