NEWS

Sai Dharam Tej: నటి పావల శ్యామలకు మెగా మేనల్లుడు ఆర్థిక సహాయం...!

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ హెల్పింగ్ నేచర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎవరైనా కష్టం ఉందని తలుపు తడితే.. తనకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సాయి దుర్గ తేజ్ తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సీనియర్‌ నటి పావలా శ్యామలా ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఆయన తన వంతుగా లక్ష రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో పావల శ్యామలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ద్వారా ఈ సహాయాన్ని అందజేశారు. సాయి దుర్గ తేజ్‌ ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని తనకు కష్టకాలంలో ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల పావల శ్యామల ఎమోషనల్‌ అయ్యారు. అంతేకాకుండా సాయి దుర్గ తేజ్‌‌తో వీడియో కాల్‌లో కూడా మాట్లాడింది. ఇక సాయి తేజ భవిష్యత్‌లో కూడా అన్ని విధాల అండగా ఉంటానని పావల శ్యామలతో చెప్పాడు. ఇక ఇటీవలే సాయిధరమ్ తేజ్.. తండ్రీకూతుళ్లపై హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఓ వీడియో కించపరిచే విధంగా ఉందని ఆయనపై చర్య తీసుకునే విధంగా తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. అలా నోటికి ఎంతొస్తే అంత వాగిన ఆ యూట్యూబర్‌ను జైలు ఊచలు లెక్కపెట్టేవరకు తీసుకెళ్లాడు. అంతేకాకుండా అలాంటి వాళ్లపై జాగ్రత్తగా వుండాలని అవగాహన కల్పించారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా తెలంగాణ ప్రభుత్వం హనుమంతుపై చర్యలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ‘విరూపాక్ష’ సినిమాతో వీర లెవల్లో కంబ్యాక్ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. గతేడాది ప్రథమార్థంలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట కురిపించింది. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్ల రీ సౌండ్ వినిపించింది. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ మార్కెట్‌ను కూడా అమాంతం పెంచేసింది. ఆ తర్వాత ‘బ్రో’ సినిమా రిజల్ట్ కాస్త నిరాశపరిచిన మేనమామతో కలిసి స్క్రీన్‌ పంచుకున్న ఆనందాన్నైతే ఇచ్చింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘గాంజా శంకర్’ అంటూ సంపత్ నందీతో ఓ మాస్ సినిమాను ప్రకటించాడు. టైటిట్ కు తగ్గట్టే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ది ఊరమాస్ క్యారెక్టర్ అంటూ టైటిల్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు. కానీ ఈ సినిమా బడ్జెట్ ఇష్యూల వల్ల ఆగిపోయిందని సమాచారం. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.