NEWS

Bigg Boss 8: బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్.. అసలు సీక్రెట్ రివీల్ చేశారండోయ్..!

Bigg Boss 8 Telugu Promo అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న బిగ్ బాస్.. బుల్లితెర భారీ రియాలిటీ షోగా పేరు లిఖించుకుంది. తెలుగులో విజయవంతంగా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 8వ సీజన్ కోసం రెడీ అవుతోంది. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విజేత విజేతగా నిలవగా.. సీరియల్ యాక్టర్ అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. కాగా.. సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్ చేసింది స్టార్ మా. బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభానికి ముందు నుంచే భారీ హైప్ తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ టీం.. ఆసక్తి రేకెత్తించే ప్రోమో వదిలారు. ఈ ప్రోమోతో హడావుడి స్టార్ట్ చేశారు. బిగ్‏బాస్ సీజన్ 8 కొత్త లోగో రివీల్ చేస్తూ ప్రోమో వీడియో కట్ చేశారు. బిగ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ వీడియో వదిలారు. ఎంటర్టైన్మెంట్ తీసుకువచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా ? అంటూ కొత్త లోగోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నాగార్జున. అయితే ఈ షో ఎప్పటి నుంచి షురూ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం సీక్రెట్ గానే ఉంచారు. You have been waiting for it, we have been waiting for it, everybody we know has been waiting for it! Yes, BIGG BOSS IS BACK!!! Presenting the epic new logo of Season Eight! #BiggBossTelugu8 @DisneyPlusHSTel pic.twitter.com/etqTK1PT4o తెలుగులో తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా.. ఆ తర్వాత రెండో సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి బిగ్‏బాస్ షో బాధ్యతలు అక్కినేని నాగార్జున తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా సీజన్ 8 కంటెస్టెంట్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో పలు పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర సీరియల్స్, యాంకర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ సారి జరగబోయే బిగ్ బాస్ 8 మరింత స్పెషల్ గా ఉంటుందనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ సారి షోలో స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారని సమాచారం. ఇకపోతే ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో షురూ కానుందని తెలుస్తోంది. అతి త్వరలో అఫిషియల్ డేట్ అనౌన్స్ చేయనుంది బిగ్ బాస్ టీమ్. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.