NEWS

Unemployment Benefit: ఆ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు.. ఏపీ సంగతేంటి?

ఆ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు.. ఏపీ సంగతేంటి? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే.. ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది ఎలాంటిదంటే.. యువతకు ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇస్తూ, స్టైపెండ్ కూడా ఇస్తారు. ఈ పథకాన్ని లడకా భావ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పథకం కింద నిరుద్యోగుల్లో అర్హతలు ఉన్నవారు.. ఉచితంగా జాబ్ ట్రైనింగ్ పొందుతారు. అలాగే వారికి స్టైపెండ్ కూడా లభిస్తుంది. ఎంత ఇస్తారు? ఈ పథకం ద్వారా.. ఇంటర్ పాసైన నిరుద్యోగులు.. నెలకు రూ.6,000 పొందుతారు. అలాగే డిప్లొమా చేసిన వారు నెలకు రూ.8,000 పొందుతారు. డిగ్రీ పాసైన వారు నెలకు రూ.10,000 స్టైపెండ్ కింద పొందుతారు. ఇది ఒక రకంగా నిరుద్యోగ భృతి లాంటిదే. కాకపోతే, ఇందులో మనీ ఇచ్చి వదిలేయకుండా, నిరుద్యోగులకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. తద్వారా.. నిరుద్యోగులు స్కిల్ పొందుతారు. తద్వారా వెంటనే ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఏపీ సంగతేంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. ఈ పథకాన్ని ఏపీ యువనేస్తం స్కీమ్ అని పిలుస్తున్నారు. దీని కింద నెలకు రూ.3,000 చొప్పున ఇస్తారని ప్రచారం జరుగుతోంది కానీ, ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. అందువల్ల ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. ఐతే, ఏపీ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కూడా నిర్వహించాలనుకుంది. తద్వారా యువతలో ఎవరికి ఎలాంటి స్కిల్ ఉందో తెలుసుకోవాలనుకుంటోంది. ఇది ఒక రకంగా మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నలాంటిదే. మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పడో హామీ ఇచ్చి, ఇప్పుడు అమలు చేస్తోంది. కాబట్టి.. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి నెలే దాటింది కాబట్టి.. ఇలాంటి పథకాల అమలుకు కొంత టైమ్ పట్టే అవకాశం ఉంది. మహారాష్ట్రలో పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటిది ఏపీలో కూడా కావాలనే వాదన వినిపిస్తోంది. ఐతే.. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సొంతంగా తేలేదు. ఇది కేంద్ర పథకమే. కేంద్రం రకరకాల కోర్సులకు ఇలాంటి ట్రైనింగ్ ఇస్తూ.. నెలకు రూ.8,000 ఇస్తోంది. దీన్ని లెక్కలోకి తీసుకొని, కొన్ని మార్పులతో మహారాష్ట్ర ప్రభుత్వం అమలుచేసింది అనుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం కూడా కావాలనుకుంటే ఇలా చెయ్యవచ్చు. కేంద్ర పథకం పేరేంటి? కేంద్రం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PM Kaushal Vikas scheme) పథకాన్ని తెచ్చింది. ఇది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఒక మాధ్యమాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. తద్వారా వారి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా వారికి ఉపాధి మార్గం సులభతరం అవుతుంది. అలాగే ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.8,000 చొప్పున పొందుతారు. స్కిల్ కీలకం: ప్రస్తుతం దేశంలో కోట్ల మంది యువత ఉన్నా, వారికి సరైన స్కిల్ లేకపోవడం సమస్య అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలు, తమకు స్కిల్ ఉన్న యువత కావాలని కోరుతున్నాయి. స్కిల్ లేకపోతే, తాము బయటి నుంచి ఉద్యోగులను తెచ్చుకుంటామని అంటున్నాయి. అదే జరిగితే, స్థానిక యువతకు ఉద్యోగాలు రావు. అందుకే ప్రభుత్వాలు అలర్ట్ అవుతూ, యువతకు స్కిల్ డెవలప్ చేస్తున్నాయి. కాలంతోపాటూ వచ్చే ఇలాంటి మార్పులు మంచివే. మరి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలా ప్లాన్ చేస్తుందో. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.